Wednesday, May 16, 2007

వాటికి కారకులు ఎవరు ?

"స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్" అని మొన్నీ మధ్య ఒక పోష్టు చూసాను - ఎవరో ఇన్నయ్యగారో, భాస్కర రావు గారో రాసారు...దానికి ఇలా స్పందించాలి అనిపించింది

అసలు సమస్యంతా వీరిని అలా తయారు చేసేందుకు ప్రేరేపించిన సంఘటనలు. ఆ సంఘటనలు ఎందుకు జరిగినాయి, వాటికి కారకులు ఎవరు ? ఈ సమాజంలోని మనుషులు.ఈ సమాజమే వీటిని ప్రేరేపించింది కాబట్టి అనుభవించాల్సింది ఈ సమాజమే. నేనేదో విప్లవకారుడిని, నక్సలైటుని అనుకునేరు - కాదండోయి. ముందు సమాజంలోని మనుషులని సరిగ్గా మనుషులలాగా గుర్తించి వారి హితం కోసం పనులు చేస్తే, ఈ మారణ కాండలు జరిగేవి కావేమో ఆలోచించండి.

చెడ్డవారు , మంచివారు ఎప్పుడూ సమాజంలోని భాగమే. మరి చెడుని ప్రోత్సహించే ఈ సమాజంలోని వ్యక్తులకి ఈ సమాజమే చేయూతనిస్తోంది కాబట్టి , తదనంతర పరిణామాలకు సమాజమే బాధ్యత వహించాలి. లెనిన్ అనో, హిట్లర్ అనో ఒక్కొక్క వ్యక్తిని వేలెత్తి చూపించకుండా, మారణకాండలు జరగటానికి సహాయపడిన ఈ సమాజాన్ని నిందించండి.

ఇలాగే చెడుకి చేయూతనిస్తే, చెడు జరగటానికి సాయం అందిస్తే, చెడుని అడ్డుకోకుండా చూస్తూ కూర్చుంటే ఈ సంఘటనలు ఒక్కో వ్యక్తిని మరొ హిట్లర్గా మారుస్తుంది. దానికి బాధ్యత వహించాల్సింది ఈ సమాజమే, ఈ సమాజంలోని మనుషులే

Thursday, May 3, 2007

A superb page of telugu literature

A superb page of telugu literature in software industry for every generation.

www.maganti.org/page5.html


read more digg story

Friday, April 27, 2007

పడిపోవాలి అంతే !

ఇక్కడ నాకు నచ్చిన కథలు పడిపోవాలి అంతే ...లేకపోతే సహించను అంతే ...అశ్శరభ అశ్శరభ...

కథలు పడకపోతే దక్షుడి యజ్ఞం అయిపోతుంది ఇక్కడ...అంతే !!

అశ్శరభశ్శరభ... మొదటి టపా !!

అశ్శరభశ్శరభ... మొదటి టపా !!